manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 11:30 am Editor : user5442714

ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల భరోసా -ఇందిరమ్మ జీవిత బీమా-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నడిగోటి రాము

ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల భరోసా




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇందిరమ్మ జీవిత బీమా

భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నడిగోటి రాము

మొగుళ్ళపల్లి: నవంబర్ 18, (మన భారత్):

పేద కుటుంబాలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చిన గొప్ప పథకమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నడిగోటి రాము అన్నారు. బుధవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటిని పోషించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ పథకం తెచ్చిందన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు ఇస్తుందని, ఇందుకు ప్రజలు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదని తెలిపారు. 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల లోపు ఉన్న కుటుంబ పెద్దకు ఈ బీమా వర్తిస్తుందని, ఆధార్ కార్డు ఉంటే చాలన్నారు. ఇంతకు ముందు రైతులకు మాత్రమే ఉన్న బీమాను ఇప్పుడు భూమి లేని పేదలకు కూడా ఇవ్వడం చాలా గొప్ప విషయమన్నారు. ఇందిరా గాంధీ జయంతి అయిన నవంబర్ 19న సిద్దిపేటలో ఈ పథకం మొదలవుతుందని, తర్వాత ప్రతి గ్రామంలో శిబిరాలు పెట్టి దరఖాస్తులు తీసుకుంటారని ఆయన వివరించారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});