manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 11:28 am Editor : user5442714

బీసీ సంక్షేమ సంఘం నిర్మాణ బలమే..బీసీల రాజ్యాధికారానికి సోపానం -వేముల మహేందర్ గౌడ్

బీసీ సంక్షేమ సంఘం నిర్మాణ బలమే..బీసీల రాజ్యాధికారానికి సోపానం:  వేముల మహేందర్ గౌడ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మొగుళ్ళపల్లి: నవంబర్ 18, (మన భారత్):

బీసీ సంక్షేమ సంఘం నిర్మాణ బలమే బీసీల రాజ్యాధికారానికి సోపానమని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో బీసీ సంక్షేమ సంఘ నిర్మాణాన్ని రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు బలంగా నిర్మించడం ద్వారానే, అన్ని స్థాయిలలో బీసీల రాజ్యాధికార సాధన సాధ్యమన్నారు. రాజకీయేతర మూలాలు బలంగా లేకపోతే, రాజకీయంగా విజయం సాధించలేమన్నారు. మాన్యశ్రీ కాన్షీరామ్ మెథడాలజీని ఆయన గుర్తుచేశారు. ముందుగా మన సంఘ నిర్మాణాన్ని అన్ని స్థాయిలలో విస్తృత పరుచుకోవాలన్నారు. అందుకు నిరంతరం బీసీ కులాల ప్రజలతో మమేకమై వారి సమస్యలు, అవసరాలు, ఆకాంక్షల మేరకు సంఘ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలన్నారు. పలు జాతీయ, రాష్ట్రస్థాయి సమస్యలపై, ఉన్నత స్థాయి కమిటీలు ఇచ్చే ఉద్యమ పిలుపులందుకొని తమ ప్రాంత బీసీ సమాజాన్ని చైతన్యపరిచి ఎప్పటికప్పుడు పోరాటాలకు సిద్ధపరచాలన్నారు. మన సంఘ నేతృత్వంలో ఏ స్థాయి ఉద్యమాలు, పోరాటాలనైన విజయవంతం చేయాలంటే, అన్ని స్థాయిలలో సంఘ నిర్మాణం పటిష్టంగా ఉండాలన్నారు. గ్రామ, వార్డు, డివిజన్ స్థాయిలలో వాడవాడలా బీసీ జెండాలు ఎగిరేలా, సంఘం ఏజెండాను ప్రతి బీసీ గుండెకు చేర్చేలా కృషి చేయాలని, ఇప్పటివరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు మన సంఘం పోరాడి సాధించిన విజయాలను బీసీ సమాజానికి చేరవేసి, చైతన్యపరిచి సంఘ అభివృద్ధికి కృషి చేయాలని వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీల సమస్యల పరిష్కారానికై విస్తృత ప్రచారం కల్పిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సంస్థలన్నింటికీ ఈ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});