తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల గౌరవ అధ్యక్షుడిగా నిమ్మల సారయ్య
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మొగుళ్ళపల్లి: నవంబర్ 18, (మన భారత్):
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో ముందుండి పోరాడి సబ్బండ వర్గాలను చైతన్యవంతులను చేసి ఉద్యమంలో పాల్గొనేలా చేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్,ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు. నిమ్మల సారయ్యను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మొగుళ్ళపల్లి మండల గౌరవ అధ్యక్షుడిగా ఆ సంఘం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి సూచనల మేరకు బుధవారం చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు జన్నే యుగంధర్ అధ్యక్షతన టేకుమట్ల, మొగుళ్ళపల్లి, చిట్యాల మండలాల స్థాయి సదస్సులో రాష్ట్ర నాయకులు మందల రవీందర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పున్నం రవి, భూపాలపల్లి డివిజన్ అధ్యక్షుడు పైడిపల్లి రమేష్, జిల్లా నాయకులు కత్తి సంపత్, విద్యార్థి సంఘం నాయకులు గుర్రాల సుమన్ రెడ్డి లు హాజరై ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా డివిజన్ నాయకులు మాట్లాడుతూ నాడు జరిగిన ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉద్యమకారులను గుర్తించి ఇప్పుడు ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విధంగా అలాగే మనకు రావాల్సిన హక్కుల కోసం ముందుండి పోరాడే న్యాయబద్ధంగా సాధించుకోవడం కోసం ఈ ఉద్యమకారుల పోరం పనిచేస్తుందని అన్నారు. ఈనెల 22న ఉద్యమ స్ఫూర్తితో పోరం ఆధ్వర్యంలో మేడారం సమ్మక్క సారక్క తల్లుల సన్నిధిలో జంపన్న వాగు నుండి గద్దెల వరకు చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయడం కోసం స్వచ్ఛందంగా ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నిమ్మల సారయ్య తో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న రవీందర్ రెడ్డి, పున్నం రవి, పైడిపల్లి రమేష్, కత్తి సంపత్ లను చిట్యాల మండల ఉద్యమకారుల ఫోరం నాయకులు శాలువాతో సన్మానించి అభినందించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
