manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 2:21 am Editor : user5442714

BJYM తలమడుగు మండల అధ్యక్షుడిగా దాతజీ కిరణ్

BJYM తలమడుగు మండల అధ్యక్షుడిగా దాతజీ కిరణ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: దాతజీ కిరణ్

మన భారత్, తలమడుగు: నవంబర్ 17, భారతీయ జనతా యువ మోర్చా (BJYM) తలమడుగు మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దాతజీ కిరణ్ పార్టీ బలోపేతానికి, యువతను సంఘటితం చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. తనపై మరోసారి నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ జిల్లా నాయకత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దాతజీ కిరణ్ మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తానని పేర్కొన్నారు. ఈ పదవిని కేవలం హోదాగా కాకుండా ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశంగా భావిస్తున్నానన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, క్రమశిక్షణకు కట్టుబడి యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి భారతీయ జనతా యువ మోర్చాను మండల స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో, పార్టీ కార్యకర్తల సహకారంతో తలమడుగు మండలంలోని యువతను రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తానన్నారు. మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ నాయకుల సహకారంతో నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ నాయకత్వం ఆశించిన విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా తనకు ఈ బాధ్యతను అప్పగించిన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు కాళ్ల సాయి కృష్ణతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, ప్రతి ఒక్క కార్యకర్తకు దాతజీ కిరణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});