భీంపూర్లో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి
మన భారత్, భీంపూర్: నవంబర్ 17, భీంపూర్ మండల కేంద్రంలో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడంలో సంక్షేమ పథకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చేయూత పింఛన్లు తోడ్పడతాయని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడంతో కార్యక్రమంలో సందడి నెలకొంది. పింఛన్ల ద్వారా తమకు ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కౌడాల నారాయణ, భీంపూర్ సర్పంచ్ రచన రవీందర్, ఎంపీడీవో గోపాల కృష్ణ రెడ్డి, మండల అధ్యక్షుడు సుదర్శన్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
