manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 2:42 am Editor : user5442714

అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి

తాంసిలో ఘనంగా చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, తాంసి: నవంబర్ 17, తాంసి మండల కేంద్రంలోని రామాలయం ఫంక్షన్ హాల్‌లో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు వారు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు చేయూత పింఛన్లు ఉపయోగపడతాయని తెలిపారు. నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పింఛన్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా తమకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపుల నర్సయ్య, తహసీల్దార్ మధుసూదన్, తాంసి సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కౌడాల నారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});