manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 2:45 am Editor : user5442714

నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – బోరంచు శ్రీకాంత్ రెడ్డి

అర్హులైన పేదలకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలో నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు వారు అందజేశారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో చేయూత పింఛన్లను అందిస్తోందన్నారు. పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి జీవనానికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపుల నర్సయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ కౌడాల నారాయణ, ఎంపీడీవో శంకర్, సుంకిడి సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ ప్రకాష్, తలమడుగు మండల ప్రెసిడెంట్ ప్రతాప్ కాసుల, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});