manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 2:27 am Editor : user5442714

పశువుల దొంగతనం జంతువధ కేసులో మరో నిందితుడి అరెస్ట్

పశువుల దొంగతనం, జంతువధ కేసులో మరో నిందితుడి అర




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ముగ్గురు కలిసి ఎడ్లను దొంగిలించి బైంసాకు తరలింపు.. వధించి మాంసం విక్రయం

గతంలో ఇద్దరు అరెస్ట్.. తాజాగా మరో నిందితుడిని రిమాండ్‌కు తరలించిన బోథ్ పోలీసులు

మన భారత్, బోథ్, నవంబర్ 17: బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పశువుల దొంగతనం, జంతువధ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు వ్యక్తులు కలిసి పశువులను దొంగిలించి బైంసాకు తరలించి, అక్కడ వధించి మాంసాన్ని విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా, తాజాగా మూడో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు బోథ్ సీఐ డి. సాయినాథ్ తెలిపారు.

పథకం ప్రకారం పశువుల దొంగతనం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ముగ్గురు నిందితులు కలిసి పశువుల దొంగతనానికి పథకం రూపొందించారు. ఇందులో భాగంగా 2026 సెప్టెంబర్ 19న బైంసా నుంచి మాక్స్ బొలెరో పికప్ వాహనంలో బయలుదేరి ఇచ్చోడ, సోనాల మీదుగా సాకేరా గ్రామానికి చేరుకున్నారు.

గ్రామంలో ఓ ఇంటి బయట కట్టివేసి ఉన్న ఎడ్లను ముందుగానే గుర్తించిన నిందితులు అర్ధరాత్రి సమయంలో వాటిని దొంగిలించి పికప్ వాహనంలో ఎక్కించుకొని బైంసాకు తరలించారు. అనంతరం దొంగిలించిన పశువులను వధించి, మాంసాన్ని విక్రయించారు. విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను ముగ్గురు పంచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

కోరమండల్ సమీపంలో పట్టుబడిన నిందితుడు

ఈ కేసులో గతంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నవంబర్ 17న మధ్యాహ్నం బోథ్ పట్టణంలోని కోరమండల్ సమీపంలో ఉన్న ఓ టీ దుకాణం వద్ద అబ్దుల్ సాజిద్ అలియాస్ జావీద్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుంచి నగదుతో పాటు వివో సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ద్వారా రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడి వివరాలు

అబ్దుల్ సాజిద్ అలియాస్ జావీద్ (23), తండ్రి వాహెద్, నయా ఆబాది గల్లి, బైంసా, నిర్మల్ జిల్లా.

ఈ కేసులో ముగ్గురు నిందితులపై చర్యలు తీసుకున్నామని, పశువుల దొంగతనం, అక్రమ జంతువధ వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ అరెస్ట్ కార్యక్రమంలో బోథ్ ఎస్‌ఐ వి. పురుషోత్తం పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});