అర్హులైన పింఛన్‌దారులకు పింఛన్ల పంపిణీ..
అర్హులైన పింఛన్‌దారులకు పింఛన్ల పంపిణీ మన భారత్, తలమడుగు: నవంబర్ 17, తలమడుగు మండల కేంద్రంలో అర్హులైన పింఛన్‌దారులకు ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థికంగా ఎంతగానో తోడ్పడుతున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు....