దేవాపూర్‌లో 90 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి: సర్పంచ్ పొరండ్ల సంతోష్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, తలమడుగు:నవంబర్ 17,
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా దేవాపూర్ గ్రామంలో పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మొత్తం 90 మంది అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్ కాపీలను గ్రామ సర్పంచ్ పొరండ్ల సంతోష్ అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పొరండ్ల సంతోష్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పెన్షన్లు పేద, నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వృద్ధులు, వితంతువులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థికంగా కొంతమేర తోడ్పాటు అందిస్తాయని పేర్కొన్నారు. గ్రామంలో అర్హత ఉన్నవారిని గుర్తించి వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు.
పెన్షన్ మంజూరు పత్రాలు అందుకున్న 90 మంది లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపతి నాగేష్, ఓసా రవి, జలంధర్, నారాయణ, నవీన్, శ్రీనివాస్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
