గన్పూర్ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మార్కెట్ పన్ను చెల్లించకుండా ధాన్యం తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
మన భారత్, బోథ్, నవంబర్ 16:
బోథ్ మండల సరిహద్దుల్లోని గన్పూర్ చెక్‌పోస్ట్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు అక్కడ నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేశారు. ధాన్యం రవాణాకు సంబంధించిన వివరాలు, మార్కెట్ పన్ను వసూళ్ల రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మార్కెట్ పన్ను చెల్లించకుండా ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మార్కెట్ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చెక్‌పోస్ట్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం రవాణా చేసే వాహనాలను నిశితంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు.
మార్కెట్ కమిటీ ఆదాయాన్ని పెంపొందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. చెక్‌పోస్టుల వద్ద విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.
మార్కెట్ కమిటీ ఆదాయం పెరిగితే రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మార్కెట్ అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చెక్‌పోస్ట్‌ల ద్వారా జరిగే పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
