విశ్వజిత్ నాయక్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నిజామాబాద్‌లో ఘనంగా రాథోడ్ బాపురావు కుమారుడి వివాహ వేడుక..
మన భారత్, నిజామాబాద్,మనవంబర్ 16
తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో జరిగిన ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కుటుంబ వివాహ వేడుకకు హాజరయ్యారు. రాథోడ్ బాపురావు కుమారుడు కె.ఆర్. విశ్వజిత్ నాయక్, శీతల్ వివాహం నిజామాబాద్‌లోని పైడి కన్వెన్షన్ హాల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ శుభకార్యానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్వకుంట్ల కవితకు రాథోడ్ బాపురావు కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరులు కె.ఆర్. విశ్వజిత్ నాయక్, శీతల్‌ను ఆమె ఆప్యాయంగా పలకరించి అభినందించారు. నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పరస్పర ప్రేమానురాగాలతో నిండు నూరేళ్లు కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు.
వివాహ వేడుకలో కొద్దిసేపు గడిపిన కవిత కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆత్మీయంగా మాట్లాడారు. పార్టీ అధినేత్రి స్వయంగా తమ కుటుంబ శుభకార్యానికి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించడంతో రాథోడ్ బాపురావు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో రాథోడ్ బాపురావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రస్తుతం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడి వివాహ వేడుకకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై ఆశీర్వదించడం రాజకీయ వర్గాల్లోనూ ప్రాధాన్యత సంతరించుకుంది.
కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు, రాజకీయ ప్రముఖుల సందడి మధ్య విశ్వజిత్ నాయక్, శీతల్ వివాహ వేడుక ఆనందోత్సాహాలతో సాగింది. నూతన వధూవరులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
