manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 2:45 pm Editor : user5442714

అభివృద్ధి పనులకు శ్రీకారం..

మామిడిగూడలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 16, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు మెరుగైన పాలనా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను నిర్మిస్తోందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా నూతన భవనానికి ప్రారంభోత్సవం నిర్వహించి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనం అనేది గ్రామ పరిపాలనకు కీలక కేంద్రంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సేవలు పొందేందుకు నూతన భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

గ్రామస్థాయిలో పాలనా వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ముఖ్యమని అన్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ పరిపాలనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడటంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు మరింత వెసులుబాటు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మామిడిగూడ సర్పంచ్ మాడావి రాంబాయి, ఉప సర్పంచ్ చరణ్, మాజీ జెడ్పీటీసీ మాడావి రాజు, పటేల్ మార్సుకుల గోవింద్ రావు, జంగు, హన్మంతు, సారంగ్ రావు, వార్డు సభ్యులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});