manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 1:32 pm Editor : user5442714

ఘనంగా శ్రీ విధిర ట్యాక్స్ కన్సల్టేషన్ కార్యాలయం ప్రారంభం

ఘనంగా శ్రీ విధిర ట్యాక్స్ కన్సల్టేషన్ కార్యాలయం ప్రారంభం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కార్యాలయాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 15, ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విధిర ట్యాక్స్ కన్సల్టేషన్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ నిర్వాహకుడు ఉష్కమల్ల మల్లన్నకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతనంగా ప్రారంభించిన సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో పన్నులకు సంబంధించిన సేవల అవసరం రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాపారులు, వివిధ సంస్థల నిర్వాహకులతో పాటు సామాన్య ప్రజలకు ఆదాయపు పన్ను, జీఎస్టీ, ఇతర పన్నుల వ్యవహారాల్లో సరైన సమాచారం, నిపుణుల సలహాలు ఎంతో అవసరమని అన్నారు. ఈ నేపథ్యంలో ట్యాక్స్ కన్సల్టేషన్ కార్యాలయాలు ప్రజలకు ఉపయోగకరమైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

పన్నుల చెల్లింపు, రిటర్నుల దాఖలు, సంబంధిత ప్రభుత్వ నిబంధనలపై సరైన అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. శ్రీ విధిర ట్యాక్స్ కన్సల్టేషన్ కార్యాలయం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు, అవసరమైన మార్గదర్శకత్వం అందించి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడు తోట శివన్న, నాయకులు అలీమ్, కమరుద్దీన్, మహేందర్ యాదవ్, రాము, గండ్రత్ మల్లేష్, కొంపల్లి భగవండ్లు, నాగన్న తదితరులు పాల్గొని కార్యాలయ నిర్వాహకుడు ఉష్కమల్ల మల్లన్నకు అభినందనలు తెలిపారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});