manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 1:42 pm Editor : user5442714

నిశ్చితార్థ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు

నిశ్చితార్థ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 15, ఆదిలాబాద్ పట్టణంలోని సాయి పంచవతి హోటల్‌లో ఆదివారం నిర్వహించిన వెంకట సాయి రెడ్డి, శ్రేయ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, వారి నూతన జీవితానికి ఆశీస్సులు అందించారు.

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బోరంచు శ్రీకాంత్ రెడ్డి వధూవరులను అభినందించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకలో మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, మోహన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, వినోద్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});