manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 11:13 am Editor : user5442714

బిజెపి ఎస్టి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు

గిరిజన హక్కుల కోసం పోరాడిన యోధుడు బిర్సా ముండా.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆయన ఆశయాలు, త్యాగాలు యువతకు స్ఫూర్తిదాయకం.

రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 15 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్టీ మోర్చా శాఖ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మాలోత్ సాయి కిరణ్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల హక్కుల పరిరక్షణ, ఆత్మగౌరవం కోసం బ్రిటిష్ పాలకులపై ధైర్యంగా పోరాడిన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా అని కొనియాడారు. గిరిజన సమాజ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, చూపిన తెగువ, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

బిర్సా ముండా ఆశయాలు, ధైర్యసాహసాలు, త్యాగనిరతి నేటి యువతకు ఆదర్శప్రాయమని తెలిపారు. ఆయన స్ఫూర్తితో గిరిజన సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వారి హక్కులను కాపాడేందుకు సమష్టిగా కృషి చేయాలని సాయికిరణ్ నాయక్ కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});