దేవపూర్ ప్రభుత్వ పాఠశాలలో బాలల గ్రామసభ
బాలల సమస్యలు, అభిప్రాయాలపై చర్చ.. విద్యార్థులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, తలమడుగు:
తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామంలో బాలల హక్కులు, వారి సమస్యలు, అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలో బాలల గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలల గ్రామసభ నిర్వహించి విద్యార్థుల భాగస్వామ్యంతో బాలల సంక్షేమం, విద్య, పాఠశాల వాతావరణం, పిల్లలకు అవసరమైన సౌకర్యాల ప్రాధాన్యతపై చర్చించారు. గ్రామస్థాయి కార్యక్రమాల్లో బాలలకు భాగస్వామ్యం కల్పించడం, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఇవ్వడం ఈ గ్రామసభ ముఖ్య ఉద్దేశంగా నిలిచింది.
అనంతరం విద్యార్థుల భాగస్వామ్యంతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఆహారపు అలవాట్లు, పోషకాహారం ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా కార్యక్రమం సాగింది. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేకల శ్రీరాములు, వార్డు సభ్యులు డి. గంగాధర్, గ్రామ కార్యదర్శి ఇజ్జిగిరి రాందాస్, దూస నర్సింలు, నాయిని సురేష్, శానం నడిపి బూమన్న, షగంటి ఆశన్న, దేవల్ల స్వామి, బాగోతుల శేఖర్, శీపతి గంగయ్య, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
