ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్‌పై బదిలీ వేటు.. కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ బాలి రామ్ చిక్టే నియామకం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రిమ్స్‌లో వరుస ఘటనల నేపథ్యంలో కీలక పరిపాలనా మార్పులు
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 14,
ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చోటుచేసుకుంటున్న వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిమ్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జైసింగ్ రాథోడ్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను నాగర్‌కర్నూల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా నియమిస్తూ వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టియాన ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో డైరెక్టర్ మార్పుతో పాటు ఇతర కీలక పదవుల్లోనూ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ బాలి రామ్ చిక్టేను ఆదిలాబాద్ రిమ్స్ నూతన డైరెక్టర్‌గా నియమించింది.
అదేవిధంగా రిమ్స్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వెంకట్ లకావత్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకాలతో రిమ్స్ పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇటీవల రిమ్స్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగా నియమితులైన అధికారులు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలు, పరిపాలనా వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనే అంశంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
