manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 12:45 am Editor : user5442714

ఓబీసీల కోటా తేల్చాకే డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: వేముల మహేందర్ గౌడ్

ఓబీసీల కోటా తేల్చాకే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి-వేముల మహేందర్ గౌడ్ డిమాండ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బీసీ మహిళలకు సబ్ కోటా లేకుండా మహిళా బిల్లు వృధా

30 ఏళ్లుగా బీసీలకు అన్యాయమే -కేంద్రం వైఖరిపై వేముల ఫైర్

మొగుళ్ళపల్లి: నవంబర్ 14, (మన భారత్):

చట్టసభల్లో 50 శాతం సీట్లు పెంచేందుకు నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రం తీసుకొస్తున్న మూడు బిల్లుల్లో ఓబీసీలకు, ఓబీసీ మహిళలకు కోటా తేల్చకుండా అమలు చేస్తే ఓబీసీలకు ఒరిగేదేమీ ఉండదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఆ మూడు బిల్లులు వీగిపోవడానికి కారణం బీసీల డిమాండ్లను పట్టించుకోకపోవడమేనన్నారు. ఏప్రిల్ 16న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ కుల సంఘాలు, మహిళా సంఘాలు “మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా” కావాలని మహా ధర్నా చేసినా, 17న ఏపీ భవన్ వద్ద బిల్లుల ప్రతులను దగ్ధం చేసినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు.

బీసీలకు ప్రయోజనం శూన్యం

డీలిమిటేషన్ ద్వారా పెంచిన 50 శాతం స్థానాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు లేకుండా, 33 శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా లేకుండా ఎన్ని చట్టాలు తెచ్చినా బీసీలకు ప్రయోజనం శూన్యమని వేముల మహేందర్ గౌడ్ స్పష్టం చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఓబీసీ సంఘాలు పోరాడుతున్నా పాలక, ప్రతిపక్షాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. పార్లమెంటులో ఏ ఒక్క పార్టీ ఎంపీ కూడా బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం విచారకరమన్నారు.

బీసీలను ఓటు యంత్రాలుగా చూడొద్దు

ఓబీసీల కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని 30 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామని, బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా చూస్తూ అధికార పీఠాలను పెత్తందారీ వర్గాలే అధిష్టించాలనుకోవడం తగదని ఆయన అన్నారు. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనైనా అన్ని పార్టీల ఎంపీలు బీసీల పట్ల ఉదాసీనత విడనాడి, రాజ్యాంగ సవరణతో పాటు ఓబీసీలకు జనాభా దామాషా మేరకు సీట్లు కేటాయించేలా సవరణ చేసి, 30 ఏళ్ల బీసీల కలలను సాకారం చేయాలని కేంద్రానికి, ఎంపీలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వేముల మహేందర్ గౌడ్ తెలిపారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});