నూతన చేయూత పెన్షన్ల పంపిణీ
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మొగుళ్ళపల్లి: నవంబర్ 14, మన (భారత్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలో 572 మందికి నూతన చేయూత పెన్షన్లను , అలాగే పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు మొగుళ్ళపల్లి జెడ్ పి హెచ్ ఎస్ హైస్కూల్ లో శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వితంతువులు, దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులతో జీవించకూడదనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో నూతన పింఛన్లను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం అనేకమంది అర్హులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని, కొత్త పింఛన్ల మంజూరులో కూడా అర్హులైన వారందరికీ న్యాయం జరగలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందించడంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.అలాగే, ఆడపిల్లల వివాహం పేద కుటుంబాలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు. గతంలో ఈ పథకాల అమలులో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తోందని, ఆపద సమయంలో అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా ప్రజాప్రతినిధిగా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎండి రఫీ, నడిగోటి రాము, తక్కల్లపల్లి రాజు,క్యాతరాజు రమేష్, మండ రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
