కూచులపూర్‌లో బాలల గ్రామసభ.. 100 శాతం హాజరు సాధించిన విద్యార్థులకు బహుమతులు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బాలల హక్కులు, విద్యాభివృద్ధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
మన భారత్, తలమడుగు:నవంబర్ 14,
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండలం కూచులపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో బాలల గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మోడెపు వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 100 శాతం హాజరు నమోదు చేసిన విద్యార్థులకు సర్పంచ్ మోడెపు వెంకన్న బహుమతులు అందజేశారు. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవడం ద్వారా విద్యార్థులు విద్యలో మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
బాలల గ్రామసభలో విద్యార్థుల భాగస్వామ్యానికి ప్రాధాన్యత కల్పించారు. పిల్లలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. బాలల విద్య, అభివృద్ధి, సంక్షేమం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సాయికుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
