manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 1:21 am Editor : user5442714

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

భారతదేశ ఆధునిక నిర్మాణానికి నెహ్రూ వేసిన పునాదులు చిరస్మరణీయం
జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు
విజ్ఞాన్ స్పెషల్ స్కూల్ చిన్నారులతో బాలల దినోత్సవ వేడుకలు.. విద్యార్థులకు విద్యా సామగ్రి, బిస్కెట్ల పంపిణీ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 14,

భారతదేశ తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని విజయ డైరీ సమీపంలో ఉన్న విజ్ఞాన్ స్పెషల్ స్కూల్‌ను సందర్శించి చిన్నారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు బిస్కెట్లు, పెన్సిళ్లు, పెన్నులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గండ్రత్ సుజాత మాట్లాడుతూ.. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం ఆధునిక భారతదేశ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేసిన దార్శనిక నాయకుడని కొనియాడారు. అనేక సవాళ్ల మధ్య స్వాతంత్ర్యం పొందిన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి విధానాలను అమలు చేశారని, 1950లో ప్రణాళికా సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని వివరించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, విద్యుత్, ఉక్కు, భారీ పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ దేశ ఆర్థిక స్వావలంబనకు కృషి చేశారని తెలిపారు.

అదేవిధంగా ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వైద్య పరిశోధన రంగాల అభివృద్ధికి నెహ్రూ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యా, వైద్య సంస్థల అభివృద్ధికి ప్రోత్సాహం అందించడంతో పాటు శాస్త్రసాంకేతిక రంగాల్లో దేశం పురోగతి సాధించేందుకు పరిశోధనా సంస్థలు, జాతీయ ప్రయోగశాలల ఏర్పాటుకు బాటలు వేశారని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, లౌకికవాదం, సామాజిక సమానత్వం, మహిళల హక్కులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు. నేటి ఆధునిక భారతదేశ అభివృద్ధిలో నెహ్రూ అనుసరించిన విధానాలు, ఆయన వేసిన పునాదులు కీలక పాత్ర పోషించాయని వివరించారు.

పిల్లలే దేశ భవిష్యత్తు

పిల్లలంటే ఎంతో ప్రేమాభిమానాలు కలిగిన నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14ను దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని గండ్రత్ సుజాత తెలిపారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు కల్పించినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు.

విజ్ఞాన్ స్పెషల్ స్కూల్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులతో బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి పిల్లలకు ప్రేమ, ఆత్మవిశ్వాసం, ప్రోత్సాహం, నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖిజర్ పాషా, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నపూర్ణ, జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఇన్‌చార్జి గౌలి సంజీవ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మీర్జా ఇమ్రాన్ బేగ్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దేవిదాస్ చారి, మావల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు అక్తర్ అలీ, మందాకిని, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు మునిగేలా నర్సింగ్, సేవాదళ్ నాయకుడు ఆఫ్సర్, పట్టణ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, వార్డు అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});