manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 1:23 am Editor : user5442714

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కార్యదర్శిగా కాట్రేవుల కుమార్ నియామకం

2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర.. ఉద్యమకారుల హర్షం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్: చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కాట్రేవుల కుమార్‌ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శిగా నియమించారు.

2001 సంవత్సరం నుంచే ఉమ్మడి చిట్యాల మండల పరిధిలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ కీలక భూమిక పోషించిన కాట్రేవుల కుమార్‌కు జిల్లా కార్యదర్శి పదవి దక్కడం పట్ల పలువురు ఉద్యమకారులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కాట్రేవుల కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి మందల రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గట్టన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పున్నం రవి, నియోజకవర్గ కన్వీనర్ పైడిపల్లి రమేష్, చిట్యాల మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు జన్నె యుగేందర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని, ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాటం కొనసాగిస్తానని కాట్రేవుల కుమార్ స్పష్టం చేశారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});