manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 1:21 pm Editor : user5442714

దాహెగావ్‌లో విట్టల్ కుటుంబాన్ని పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు..

దాహెగావ్‌లో విట్టల్ కుటుంబాన్ని పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, బేల: నవంబర్ 14, బేలా మండలం దాహెగావ్ గ్రామానికి చెందిన దేవ్‌గాలే విట్టల్ మృతి పట్ల ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విట్టల్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

అనంతరం విట్టల్ కుమారులు అమూల్, గజానన్‌లను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి కలిగిన నష్టాన్ని పూడ్చలేనిదని, ఇలాంటి కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబానికి తగిన అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో దాహెగావ్ సర్పంచ్ భోక్రే శంకర్, మాజీ జెడ్పీటీసీ నక్లే రాందాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంఖడే, బేలా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రూప్రావ్ వాంఖడే, మాజీ ఎంపీపీ ఉల్కే బాపురావు, జైనథ్ సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});