manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 7:07 am Editor : user5442714

నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి : ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి – ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చాచా నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 14, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న చాచా నెహ్రూ విగ్రహానికి మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం నెహ్రూ చేసిన పోరాటం, స్వాతంత్య్రానంతరం దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలను భారత ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. నెహ్రూ జయంతిని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆయనకు పిల్లల పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనమన్నారు.

నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు, భావి పౌరులని పేర్కొంటూ ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పిల్లల ప్రతిభను గుర్తించి, వారి అభివృద్ధికి పెద్దలు ప్రోత్సాహం అందించాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, బాలల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ గురుకుల విద్యాసంస్థల ద్వారా విద్యా అవకాశాలను విస్తరిస్తోందని తెలిపారు. నెహ్రూ జీవితాన్ని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని భావితరాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ సూపర్‌వైజర్ రాజ్ కిరణ్, అసిస్టెంట్ మార్కెట్ సూపర్‌వైజర్ స్వామి, ఎల్‌డీసీ అవినాష్, జూనియర్ మార్కెట్ సూపర్‌వైజర్ హసన్, హరీష్, మోసిన్, అల్లూరి భూమారెడ్డి, మనోజ్, ప్రఫుల్, నాగన్న, శివ్వరెడ్డి, విశాల్, త్రిషల్, గణేష్, దినేష్, రవి, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});