బేలా మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం.. క్వింటాల్‌కు రూ.8,935 ధర నమోదు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకురావాలి.. తేమ శాతం 8 నుంచి 12 లోపు ఉండాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
మన భారత్, బేల:నవంబర్ 13,
బేలా మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పత్తి కొనుగోళ్ల ప్రారంభ ముహూర్త పూజలో పాల్గొని కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్‌లో పత్తి క్వింటాల్‌కు రూ.8,935 ధర పలికినట్లు వారు వెల్లడించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతావరణంలో మంచు కురుస్తుండటంతో పత్తి పంటలో తేమ శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రైతులు తమ పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చే ముందు తేమ శాతం 8 నుంచి 12 శాతం మధ్య ఉండేలా చూసుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పత్తిని విక్రయానికి తీసుకువస్తే రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
హర్యానా వంటి ప్రాంతాల్లో పశువుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల అక్కడ పత్తి సీడ్‌కు సుమారు రూ.200 వరకు అదనపు ధర లభిస్తున్నట్లు వివరించారు. అదే తరహాలో మన ప్రాంతంలోని రైతులు కూడా నాణ్యమైన పత్తిని, తగిన తేమ శాతంతో మార్కెట్‌కు తీసుకువస్తే ఇతర ప్రాంతాల కంటే రూ.200 వరకు అదనపు ధర లభించేలా ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి కృషి చేస్తామని బోరంచు శ్రీకాంత్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.
రైతులు పత్తి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, తేమ శాతం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొనుగోలు సదుపాయాలను వినియోగించుకుని, నాణ్యమైన పంటను విక్రయించడం ద్వారా మెరుగైన ఆదాయం పొందాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎంఓ గజానంద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీకాంత్, మార్కెట్ సిబ్బంది శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రాందాస్, మాజీ మార్కెట్ చైర్మన్లు వామన్‌రావు వాంఖడే, అశోక్ రెడ్డి, మైనారిటీ చైర్మన్ బేలా అబ్దుల్ కరీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావర్, సర్పంచులు బద్దం జగదీశ్వర్ రెడ్డి, శంకర్ భోక్రే, బేలా ఉపసర్పంచ్ ప్రకాష్, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు రాజు, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఈశ్వర్, అలీం, పత్తి కొనుగోలుదారులు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
