ఆదిలాబాద్ ఐటీ టవర్‌తో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి
మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల చారికి సాజిద్ ఖాన్ ఘన స్వాగతం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 12,
ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారికి ఆదిలాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఇరువురు ప్రముఖ నాయకులకు సాజిద్ ఖాన్ శాలువాలు కప్పి సాదరంగా సన్మానించారు. ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ వారి పర్యటనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ టవర్ ఏర్పాటు కావడం అభివృద్ధి పరంగా కీలక పరిణామమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఐటీ రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
జిల్లాలోని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ టవర్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ, పరిశ్రమల రంగాల్లో మరిన్ని సంస్థలు ఆదిలాబాద్‌కు రావడం ద్వారా జిల్లా ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని ఆకాంక్షించారు.
ఆదిలాబాద్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పన ఎంతో అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
