manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 12:57 pm Editor : user5442714

టీఎస్‌యూటీఎఫ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..

తలమడుగు మండల టీఎస్‌యూటీఎఫ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మండల అధ్యక్షుడిగా కే. శంకర్.. ప్రధాన కార్యదర్శిగా కే. గంగాధర్ ఎన్నిక

మన భారత్, తలమడుగు:నవంబర్ 12,

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) తలమడుగు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయంలో తలమడుగు మండల మహాసభలను నిర్వహించారు.

ఈ మహాసభల్లో ఉపాధ్యాయ సంఘం భవిష్యత్ కార్యాచరణ, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ అభివృద్ధి, సంఘటనా బలోపేతం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అనంతరం మండల స్థాయిలో నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియ చేపట్టగా, సభ్యుల ఏకాభిప్రాయంతో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా కే. శంకర్, మండల ప్రధాన కార్యదర్శిగా కే. గంగాధర్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు సంఘ సభ్యులు అభినందనలు తెలిపారు.

నూతన కమిటీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, విద్యారంగ అభివృద్ధి కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});