manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 1:05 am Editor : user5442714

మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సామాజిక భావోద్వేగా అభ్యాసన శిక్షణ శిబిరం

భూపాల్ పల్లి జిల్లాలో మోడల్ పాఠశాల ఉపాధ్యాయులకు సామాజిక, భావోద్వేగ అభ్యసన (Social and Emotional Learning – SEL) శిక్షణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్ చిట్యాల :భూపాలపల్లి జిల్లాలోని Chityala మోడల్ పాఠశాలలో 6 మోడల్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల కోసం సామాజిక మరియు భావోద్వేగ అభ్యసన (SEL) శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము.

ఈ కార్యక్రమానికి లెర్నింగ్ కర్వ్ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన ప్రతినిధులు , కవిత, కృప శిక్షకురాలిగా వ్యవహరించి, ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు.

ఈ శిక్షణలో భాగంగా ప్రతి ఉపాధ్యాయునికి మూడు శిక్షణ మాడ్యూళ్లను అందజేశారు. విద్యార్థుల్లో సామాజిక మరియు భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించడం, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, సానుకూల ప్రవర్తనను ప్రోత్సహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు లెర్నింగ్ కర్వ్ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్ వారు.

ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, భావోద్వేగ అవగాహన మరియు ఆరోగ్యకరమైన వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});