manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 1:00 am Editor : user5442714

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

-భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మొగుళ్ళపల్లి, నవంబర్ 11, (మన భారత్):

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ద్వేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం మొగులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధరతో పాటు బోనస్ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దళారులను ఆశ్రయించకుండా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్ లు కార్యకర్తలు,గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});