manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 12:51 am Editor : user5442714

నిర్మల్ రైతు గర్జన సభకు తరలిన బీఆర్ఎస్ నాయకులు

నిర్మల్ రైతు గర్జన సభకు రుయ్యాడి గ్రామ బీఆర్ఎస్ నాయకుల బృందం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సంఘీభావంగా తరలింపు

మన భారత్, రుయ్యాడి: నిర్మల్‌లో నిర్వహించనున్న రైతు గర్జన సభకు రుయ్యాడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల బృందం బయలుదేరింది. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రైతాంగానికి మద్దతుగా నిర్వహిస్తున్న ఈ పోరాటంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో నాయకులు సభకు తరలివెళ్లారు.

ఈ సందర్భంగా రుయ్యాడి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొజ్జ ప్రవీణ్ అన్న ఆధ్వర్యంలో బృందం బయలుదేరింది. ఈ బృందంలో బీఆర్ఎస్ మండల నాయకులు అల్లూరి సతీష్ రెడ్డి, జువ్వాక నర్సింలు (బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి), మాజీ ఎంపీటీసీ భాదూర్ నర్సిములు, నక్క గంగన్న, సంద సుధాకర్, జువ్వాక సంటెన్న, బండి సతీష్, కె. జగదీశ్వరి, ఆది రాజు, గోనెల భోజన్న తదితరులు పాల్గొన్నారు.

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ, రైతుల హక్కుల సాధన కోసం జరిగే పోరాటానికి మద్దతుగా నిలుస్తామని నాయకులు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై సభలో తమ గళాన్ని వినిపించేందుకు తరలివెళ్లారు.

ఈ సందర్భంగా నాయకులు జై తెలంగాణ.. జై జై తెలంగాణ.. జై జవాన్.. జై కిసాన్.. అంటూ నినాదాలు చేస్తూ రైతు పోరాటానికి తమ మద్దతు ప్రకటించారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});