హరిహర క్షేత్రం సుంకిడి నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా బండి సత్యం గౌడ్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, తలమడుగు:నవంబర్ 11,
తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో ప్రసిద్ధ హరిహర క్షేత్రం ఆలయ అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హరిహర క్షేత్రం సుంకిడి సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో సుంకిడి గ్రామస్తులు, వివిధ గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వామి భక్తుల సమక్షంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో నూతన కమిటీ అధ్యక్షుడిగా బండి సత్యం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా గెల్ల శశికాంత్ యాదవ్, కోశాధికారిగా గడ్డం నవీన్, ఉపాధ్యక్షుడిగా దెబ్బడి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు బండి సత్యం గౌడ్ మాట్లాడుతూ హరిహర క్షేత్రం అభివృద్ధికి కమిటీ సభ్యులందరితో కలిసి కృషి చేస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ నిర్వహణలో అవసరమైన అన్ని కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. గ్రామస్తులు, అయ్యప్ప స్వామి భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం సుంకిడి గ్రామ సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ ప్రకాష్ నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు, అయ్యప్ప భక్తులు ఐకమత్యంతో ఆలయ అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ ప్రకాష్, హరిహర క్షేత్రం కమిటీ సభ్యులు, సుంకిడి గ్రామస్తులు, వివిధ గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
