బెల్సరీ రాంపూర్‌లో ఘనంగా గుస్సాడి బృందం కోలాబోడి.. ముగిసిన దండారి ఉత్సవాలు
గుస్సాడి బృందాల కోలాబోడి.. ఘనంగా ముగిసిన దండారి ఉత్సవాలు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన వేడుకలు.. ఆటపాటలు, డోలు చప్పుళ్లతో మార్మోగిన గిరిజన పల్లెలు మన భారత్, ఆదిలాబాద్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే దండారి ఉత్సవాలు గుస్సాడి బృందాల కోలాబోడి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఎన్నో రోజులుగా గిరిజన గ్రామాల్లో ఉత్సాహంగా సాగిన ఈ ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఆదివాసీ పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. గుస్సాడి కళాకారుల...