దీపావళి పర్వదినాన సంప్రదాయబద్ధంగా దండోరా..
బెల్సరిరాంపూర్ లో భక్తిశ్రద్ధలతో గోపూజ.. సంప్రదాయాలకు పెద్దపీట మన భారత్, భీంపూర్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బెల్సరీ రాంపూర్‌లో గోమాతకు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హిందూ సంప్రదాయంలో గోమాతకు విశిష్టమైన స్థానం ఉండటంతో పండుగ వేళ గోవును లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు తమ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గోమాతను ప్రత్యేకంగా అలంకరించి పసుపు, కుంకుమ,...