భీంపూర్‌లో రెండు ఆదివాసీ కుటుంబాల కొత్త ఇళ్లలో గృహప్రవేశ వేడుకలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
‘ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు
మన భారత్, భీంపూర్:నవంబర్ 9,
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని బెల్సరీ రాంపూర్ గ్రామంలో కోవా వనిత, కూడమేత జైతు బాయి కుటుంబాలు నూతనంగా నిర్మించుకున్న ఇళ్లలో గృహప్రవేశ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని నూతన గృహ యజమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిడం కేశవ్, భీంపూర్ మాజీ ఎంపీపీ రత్న ప్రభ సంతోష్, పంచాయతీ కార్యదర్శి జలందర్ పాల్గొన్నారు. నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
సొంతింటి కలను సాకారం చేసుకుంటూ కొత్త ఇళ్లలోకి ప్రవేశించడం కుటుంబాలకు ఎంతో సంతోషకరమైన సందర్భమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పండుగ వేళ కొత్త ఇంట్లో గృహప్రవేశం జరగడం కుటుంబ సభ్యుల్లో మరింత ఆనందాన్ని నింపింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇళ్ల కల నెరవేరుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
రిపోర్టర్: గేడం రమాకాంత్, భీంపూర్ మన భారత్.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
