తలమడుగులో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన.. వ్యాసరచన, క్విజ్ పోటీలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, తలమడుగు: విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో తలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పాఠశాలలోని ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఎన్నికల విధానం, ఓటు హక్కు వినియోగం, ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైనదని, అర్హత పొందిన ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఎన్నికల వ్యవస్థ, ఓటు హక్కు ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య విలువలు వంటి అంశాలపై విద్యార్థుల నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి వారిలో ఎన్నికల పట్ల ఆసక్తిని పెంపొందించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను, పౌర చైతన్యాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో తహశీల్దార్ రాజ్మోహన్, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) వెంకట్రావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
