దీపం ఆకృతిలో ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 7 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నేడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో దీపం ఆకృతిని ప్రదర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టారి సంపత్ కుమార్ మాట్లాడుతూ ఈ దీపావళి పర్వదినం ఆ దీపాల కాంతులతో ఎలా వెలుగుతుందో విద్యార్థుల జీవితాలలో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠశాలలో పిటీఎం నిర్వహణ
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల విద్యార్థుల పిటిఎం సమావేశాన్ని నిర్వహించారు.ఈ ప్రధానోపాధ్యాయులు భట్టరి సంపత్ కుమార్ సమావేశం ఎజండా ను తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థుల ప్రగతి నివేదిన,విద్యార్థుల ప్రగతి ప్రదర్శన ప్రదర్శించడం జరిగిందన్నారు.విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాల కు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.కావున విద్యార్థులు తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు.
ప్రీ ప్రైమరీ గదిలో పత్రికల ఏర్పాటు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం నుండి శ్రీ ప్రైమరీ తరగతులు మంజూరు కాగా అట్టి తరగతి గదిలో విద్యార్థుల నైపుణ్యం, విద్యార్థుల పాఠ్యాంశాలను అనుగుణంగా రూపొందించిన గోడపత్రికలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి.. విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించాయి..
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
