manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 2:17 pm Editor : user5442714

రైతు గర్జన సభకు ఏర్పాట్లు షురూ..

రైతు గర్జన సభకు ఏర్పాట్లు షురూ.. సభాస్థలంలో భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి సభాస్థలి పరిశీలన

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 7,

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రైతు గర్జన సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభాస్థలంలో కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు.

రానున్న రైతు గర్జన సభను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులకు సూచించారు. సభకు వచ్చే రైతులు, పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. సభ విజయవంతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రైతుల సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్న ఈ సభకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని నాయకులు చర్చించారు. సభా ప్రాంగణంలో వేదిక, ఇతర మౌలిక సదుపాయాలు, అవసరమైన ఏర్పాట్లపై ప్రాథమికంగా పరిశీలన చేపట్టారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాంకిషన్ రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ యువ నాయకుడు వినయ్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్యామసుందర్, ముధోల్ నియోజకవర్గ సమన్వయకర్త విలాస్ గదేవర్, పట్టణ అధ్యక్షుడు రాము, అయ్యనగారి రాజేందర్, శ్రీకాంత్ యాదవ్, సల్మాన్‌తో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});