బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శ.. అండగా ఉంటామని భరోసా
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, బేల:నవంబర్ 7,
ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భరోసా కల్పించారు. బేల మండలంలోని దహేగావ్, కోబ్దూర్ గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్న వారిని ఓదార్చి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
కుటుంబాలకు కష్టకాలంలో అండగా ఉంటామని, అవసరమైన సమయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధిగా బాధిత కుటుంబాలకు అండగా నిలవడం తన బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మురళీధర్ ఠాక్రే, దత్తా నిక్కం, సందీప్ ఠాక్రే, బర్కడే రాము, పొత్ రాజ్ నవీన్, ఉప్పల్ వార్ నారాయణ్, జీవన్, ప్రమోద్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
