ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా దండారి ఉత్సవాలు
గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యం చేసిన డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, బజార్హత్నూర్:నవంబర్ 7,
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే దండారి (గుస్సాడి) ఉత్సవాలు బజార్హత్నూర్ మండలం అనంతపూర్ (పంగడి) గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయ కళలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ఈ వేడుకల్లో గ్రామస్థులు, గిరిజన కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న నాయకులు ముందుగా ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన దండారి (గుస్సాడి) సంప్రదాయ నృత్య ప్రదర్శనల్లో నాయకులు గిరిజన కళాకారులతో కలిసి అడుగులు కలిపారు. సంప్రదాయ వేషధారణలు, డప్పుల మోతలు, కళాకారుల నృత్యాలతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి స్వయంగా గిరిజనులతో కలిసి నృత్యం చేయడంతో వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి నాయకులు విందు భోజనంలో పాల్గొన్నారు. గిరిజన పెద్దలు, గ్రామస్థులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఇలాంటి పండుగలు సమాజంలో సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేందుకు దోహదపడతాయని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు.
ఈ కార్యక్రమంలో బజార్హత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్లెం విఠల్, వైస్ ప్రెసిడెంట్ రాథోడ్ రమేష్, గుడిహత్నూర్ మండల అధ్యక్షుడు తొడసం దౌలత్ రావు, బజార్హత్నూర్ మాజీ మండల అధ్యక్షుడు జల్కె పాండురంగ్, గిర్నూర్ సర్పంచ్ దినేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నందు, గుడిహత్నూర్ మాజీ అధ్యక్షుడు అంకత్ రవి, జిల్లా మీడియా కమ్యూనికేషన్ ప్రతినిధి జితేందర్, బోరజ్ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు పొట్ట అశోక్, గుడిహత్నూర్ ఉపాధ్యక్షుడు మొయితే మారుతి, గుడిహత్నూర్ అధికార ప్రతినిధి ఆడే జైపాల్, పోలె విష్ణు, సూర్యవంశీ పాండురంగ్, గంగాధర్, ఉత్తమ్, జగన్, సందీప్, గణేష్, దేవన్న, బాబారావుతో పాటు గ్రామ పెద్దలు, గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
