manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 2:49 pm Editor : user5442714

రైతు కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం..

పిప్పల్కోటి రైతు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ రూ.2 లక్షల ఆర్థిక సాయం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రైతు కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. కేసీఆర్‌కు, ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

మన భారత్, భీంపూర్:నవంబర్ 7,

భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన రైతు పసుల ఆశన్న ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో బాధిత రైతు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. పార్టీ సహకారంతో పాటు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

రైతు కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ సాయంతో కుటుంబానికి కొంతవరకు ఆర్థిక భరోసా లభించింది.

అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసానికి వెళ్లి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేమ శ్రీకాంత్, భీంపూర్ మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});