manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 2:37 pm Editor : user5442714

జూనియర్ కళాశాలలో క్విజ్ పోటీలు..

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల అక్షరాస్యతపై వ్యాసరచన, క్విజ్ పోటీలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, తాంసి:నవంబర్ 7,

విద్యార్థుల్లో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియపై సమగ్ర పరిజ్ఞానం కల్పించే లక్ష్యంతో తాంసి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల అక్షరాస్యత క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రాముఖ్యత, ఓటు హక్కు వినియోగం, ప్రజాస్వామ్యంలో ఓటరు బాధ్యతలు తదితర అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియపై అవగాహనను పరీక్షించేలా క్విజ్ పోటీలను ఏర్పాటు చేశారు.

ఓటరు జాబితాలో పేర్ల నమోదు విధానం, ఓటరు నమోదు ప్రక్రియ, వీవీప్యాట్ (VVPAT) యంత్రాల పనితీరు, పోలింగ్ విధానం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు అడిగి అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటు విలువ, ప్రతి పౌరుడి బాధ్యతను విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ్ భాస్కర్, పోటీల నిర్వాహకులు మల్లేష్, కార్తీక్, వెంకటేష్, సంపత్, అమరెడ్డి, ఏజీఎంసీ, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఎన్నికలపై అవగాహన పెరగడంతో పాటు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన ఓటర్లుగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});