బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం..
ప్రమాద బాధిత కుటుంబానికి వసుధ ఫౌండేషన్ ఆర్థిక సహాయం బైక్ ప్రమాదంలో గాయపడిన తల్లీకొడుకులకు రూ.10 వేల చెక్కు అందజేత మన భారత్, తలమడుగు: నవంబర్ 7, బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లీకొడుకుల కుటుంబానికి వసుధ ఫౌండేషన్ అండగా నిలిచింది. తలమడుగు మండల కేంద్రానికి చెందిన పెద్దింటి గంగమ్మ, ఆమె కుమారుడు ప్రవీణ్ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గాయాల కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమై చికిత్స పొందుతున్నారు....