manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 2:31 pm Editor : user5442714

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం..

ప్రమాద బాధిత కుటుంబానికి వసుధ ఫౌండేషన్ ఆర్థిక సహాయం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బైక్ ప్రమాదంలో గాయపడిన తల్లీకొడుకులకు రూ.10 వేల చెక్కు అందజేత

మన భారత్, తలమడుగు: నవంబర్ 7, బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లీకొడుకుల కుటుంబానికి వసుధ ఫౌండేషన్ అండగా నిలిచింది. తలమడుగు మండల కేంద్రానికి చెందిన పెద్దింటి గంగమ్మ, ఆమె కుమారుడు ప్రవీణ్ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గాయాల కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమై చికిత్స పొందుతున్నారు.

వారి పరిస్థితిని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు కాటిపెల్లి వసంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎలుగు రాజన్న ఈ విషయాన్ని భూపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో శనివారం అందజేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రవీణ్ వైద్య ఖర్చుల నిమిత్తం త్వరలో మరింత ఆర్థిక సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ సహాయం అందించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలుగు రాజన్న, కాటిపెల్లి శ్రీనివాసరెడ్డి, రూపేష్, చంద్రశేఖర్, అనిరుద్, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});