manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 2:29 pm Editor : user5442714

రూరల్ మండల అభివృద్ధి పనులపై సమీక్ష..

ఆదిలాబాద్ రూరల్ మండల అభివృద్ధి పనులపై సమీక్ష.. అధికారులకు ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి సూచనలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 6,

ఆదిలాబాద్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై అధికారులతో సమీక్షించారు.

సమావేశంలో గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందుతున్న తీరుపై చర్చించారు. ఆయా శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజలకు సంబంధించిన సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచనలు, సలహాలు అందజేశారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో డీపీఓ రమేష్, ఎంపీడీవో వంశీకృష్ణ, ఎంఈవో రమేష్ రెడ్డి, ఎంపీవో సత్య ఆనంద్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});