manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 2:19 pm Editor : user5442714

ప్రజారోగ్య పరిరక్షణకు సర్పంచ్ చర్యలు..

కుచులపూర్‌లో దోమల నివారణకు ఫాగింగ్.. ప్రజారోగ్య పరిరక్షణకు సర్పంచ్ చర్యలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, తలమడుగు:నవంబర్ 5,

గ్రామంలో దోమల బెడదను తగ్గించి ప్రజారోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఫాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న ఆధ్వర్యంలో ఇళ్ల పరిసర ప్రాంతాల్లో ఫాగింగ్ చేయించారు.

వర్షాకాలం అనంతరం ఇళ్ల చుట్టూ, మురుగు కాలువల్లో, ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, వాటి నివారణకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామంలోని వీధులు, ఇళ్ల పరిసర ప్రాంతాల్లో ఫాగింగ్ నిర్వహించడం ద్వారా దోమల వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు.

ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.

గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ తరఫున అవసరమైన పారిశుద్ధ్య, దోమల నివారణ చర్యలు కొనసాగిస్తామని సర్పంచ్ మోడేపు వెంకన్న తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోడేపు వెంకన్న, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});