మండల అభివృద్ధి పనులపై సమీక్ష.. అధికారులకు పలు సూచనలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మండల పరిషత్ సమీక్ష సమావేశానికి హాజరైన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
మన భారత్, మావల: నవంబర్ 6, మావల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలపై అధికారులతో ఆయన సమీక్షించారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలు చేశారు.
మండల అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులకు పలు సలహాలు, సూచనలు అందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో మావల మండల ప్రత్యేక అధికారి మిల్కా, ఎంఈఓ సరోజ, ఎంపీఓ నందిని, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, బట్టిసావర్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వాఘాపూర్ సర్పంచ్ దినేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
