ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ దాడువాయి యూనియన్ నూతన భవనం ప్రారంభం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి – యూనియన్ సభ్యులకు అభినందనలు
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 6,
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని దాడువాయి యూనియన్‌కు నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం యూనియన్ సభ్యులను కలిసి నూతన భవన ప్రారంభం సందర్భంగా అభినందనలు తెలిపారు. యూనియన్‌కు నూతన భవనం అందుబాటులోకి రావడం సభ్యుల సమావేశాలు, సంస్థాగత కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగకరంగా ఉంటుందని కార్యక్రమంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎంఓ గజానన్, కొనుగోలుదారుల సంఘం అధ్యక్షుడు దినేష్ రెడ్డి, ఆర్తిదారుల సంఘం అధ్యక్షుడు భూమా రెడ్డి, మునీమ్ సంఘం అధ్యక్షుడు ఆశన్న, దాడువాయి యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు నాయిని సుదర్శన్, ఏఎంసీ సభ్యుడు పోశెట్టి, యూనియన్ కార్యవర్గ సభ్యులు గంగన్న, చారి తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ పరిధిలోని వివిధ సంఘాల ప్రతినిధులు, యూనియన్ సభ్యుల సమక్షంలో నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
