manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 10:35 am Editor : user5442714

ఫాగింగ్.. ప్రజారోగ్య పరిరక్షణకు సర్పంచ్ చర్యలు

కుచులపూర్‌లో దోమల నివారణకు ఫాగింగ్.. ప్రజారోగ్య పరిరక్షణకు సర్పంచ్ చర్యలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు

మన భారత్, తలమడుగు:నవంబర్ 5,

కుచులపూర్ గ్రామంలో దోమల బెడదను తగ్గించి ప్రజారోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఫాగింగ్ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని ఇళ్ల పరిసర ప్రాంతాల్లో దోమల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సర్పంచ్ మోడేపు వెంకన్న ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా గ్రామంలోని నివాస ప్రాంతాల్లో ఫాగింగ్ చేయించారు. దోమల ఉత్పత్తిని నియంత్రించడంతో పాటు ప్రజలకు వ్యాధుల ముప్పు తగ్గించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. నీటి నిల్వ పాత్రలను తరచూ శుభ్రం చేయడంతో పాటు పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గ్రామపంచాయతీ తరఫున అవసరమైన పారిశుధ్య, దోమల నివారణ చర్యలు కొనసాగిస్తామని సర్పంచ్ మోడేపు వెంకన్న తెలిపారు. గ్రామస్తులు కూడా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});