ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి
మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, భీంపూర్:నవంబర్ 5, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.
భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామానికి చెందిన పిట్ల అంజన్న ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ముడుపు మౌనీష్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కష్టసమయంలో అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
అదేవిధంగా రూరల్ మండలం లోకారి గ్రామానికి చెందిన రాజలింగు ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సహాయం అందించారు.
ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా ముడుపు మౌనీష్ రెడ్డి పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు తమ వంతు సహకారం అందించడం ద్వారా కొంతైనా ఉపశమనం కలిగించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, రామచంద్రారెడ్డి, షుకూర్, కాశీమ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
